Meteorological: రేపు ఏపీవ్యాప్తంగా విస్తారంగా వానలు.. తొమ్మిది జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం!

Meteorological department predicts moderate rains in AP tomorrow
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల (ఆగస్టు) 5వ తేదీన శుక్రవారం విస్తారంగా వానలు పడతాయని ఆ రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించింది. ఐదారు జిల్లాలు మినహా అన్నిచోట్లా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. కర్నూల్, నంద్యాల, అనంతపూర్, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల కుండపోత వర్షం పడొచ్చని పేర్కొంది. 
  • వైఎస్సార్, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది.
  • ఈ మేరకు వివరాలను ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ గురువారం ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.
  • ఏయే ప్రాంతాల్లో ఎంతెంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందనే వివరాలతో కూడిన మ్యాప్ ను కూడా జత చేసింది.
 
Go Back to Shorts
Meteorological
Meteorological department
moderate rains in AP tomorrow
Andhra Pradesh
Rains
APSDMA

More Telugu News