బాలరాజు పాత్ర కోసం చైతన్య ఇంతలా కష్టపడ్డాడా?
Add ap7am to your home Screen

బాలరాజు పాత్ర కోసం చైతన్య ఇంతలా కష్టపడ్డాడా?

chaitanya makover in lal singh chaddah released
  • ‘లాల్ సింగ్‌ చడ్డా’ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న చైతన్య
  • బాలరాజు పాత్రలో కనిపించనున్న అక్కినేని వారసుడు
  • తన పాత్ర మేకోవర్ వీడియో రిలీజ్ చేసిన చిత్ర బృందం
‘లాల్ సింగ్‌ చడ్డా’ చిత్రంతో అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అద్వైత్ చందన్ రూపొందించిన ఈ సినిమాలో నాగచైతన్య బాలరాజు పాత్రలో కనిపించనున్నాడు. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో విడుదల అవుతోంది. తెలుగు వెర్షన్ కు మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. అదే టైమ్ లో చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీగా ఉంది. 

ఇటీవల చైతుకి సంబంధించిన లుక్‌ని విడుదల చేసిన టీమ్, ఇప్పుడు స్పెషల్ వీడియోతో అతని క్యారెక్టర్‌‌ గురించి మరిన్ని విశేషాలను పంచుకుంది. తన పాత్ర కోసం చైతూ ఎలా మేకోవర్‌ అయ్యాడు.. షూటింగ్‌ సెట్‌లో ఎంతగా కష్టపడ్డాడో చూపిస్తూ చేసిన  వీడియో ఆసక్తికరంగా ఉంది. ఇందులో చిత్రం గురించి, తన పాత్ర గురించి చైతన్య వివరించారు. ఈ కథ తన దగ్గరికి వచ్చినప్పుడు తన పాత్ర పేరు బాల అని చెప్పారన్నాడు. ఏపీలోని బోడిపాలెం నుంచి ఆర్మీలో చేరేందుకు వచ్చిన యువకుడిగా కనిపిస్తానన్నాడు. చాలా మంది పేర్లకు ముందు వారి ఇంటిపేరుగా ఊరి పేర్లు కూడా జత చేసి ఉంటాయి. అలా ఈ చిత్రంలో తన పేరు బాలరాజు బోడిపాలెం అని పెట్టారని వెల్లడించాడు.  

ఇదే పేరుతో 1948లో తాత అక్కినేని నాగేశ్వరరావు సినిమా ‘బాలరాజు’ ఉందని, దాంతో ఆ చిత్రంలోని అక్కినేని గెటప్‌ను కూడా ట్రై చేశామని చెప్పాడు.  షూటింగ్‌ జరిగినన్ని రోజులు తానో కొత్త ప్రపంచాన్ని చూశానని తెలిపాడు.‘లాల్ సింగ్ చడ్డా’లో నాగచైతన్య వివిధ గెటప్స్‌తో అలరించనున్నాడు. ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డ చైతన్యపై ఆమిర్‌ ఖాన్‌, డైరెక్టర్‌, ఇతర సాంకేతిక నిపుణులు పొగడ్తలు కురిపించారు.
.
Bollywood
Tollywood
Naga Chaitanya
lalsingh chaddah
Aamir Khan

More Telugu News