తెలంగాణలో తాజాగా 923 మందికి కరోనా
- పెరుగుతున్న కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 40,593 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 366 మందికి పాజిటివ్
- కరోనా నుంచి కోలుకున్న 739 మంది
- ఇంకా 5,170 మందికి చికిత్స
అదే సమయంలో 739 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,18,290 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,09,009 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,170 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
