Pranitha: భర్తకు పాదపూజ చేసిన నటి ప్రణీత

Pranitha follows Bheemana Amavasya
షార్ట్స్‌లో చూడండి
కర్ణాటకలో మహిళలు భీమన అమావాస్య పర్వదినాన్ని అత్యంత శుభకరమైన రోజుగా భావిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ భీమన అమావాస్యను నేడు (జులై 28) భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తాజాగా, ప్రముఖ నటి ప్రణీత కూడా ఈ పండుగను ఆచరించారు. ఆమె తన భర్త నితిన్ రాజుకు పాదపూజ చేశారు. భర్త నుంచి ఆశీస్సులు అందుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

భర్త యందు భార్య తన భక్తి ప్రపత్తులు, ప్రేమాభిమానాలు చాటుకునే పర్వదినంగా భీమన అమావాస్యకు పేరుంది. పూర్వం ఓ యువతి తన విధిరాతను అంగీకరిస్తూ మృతుడైన యువరాజును పెళ్లాడుతుంది. మరుసటిరోజున ఆమె మట్టి ప్రమిదలతో పూజచేసి శివపార్వతుల కరుణాకటాక్షాలు సంపాదిస్తుంది. శివపార్వతులు ప్రత్యక్షమై ఆమె భర్తను బతికిస్తారు. భీమన అమావాస్య వెనకున్న గాథ ఇది.

Go Back to Shorts
Pranitha
Bheemana Amavasya
Husband
Nitin Raju
Karnataka

More Telugu News