రియల్ హీరో ఎస్సైకి సైబరాబాద్ కమిషనర్ అభినందన... ఫొటోలు ఇవిగో
- మూసీలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన ఎస్సై రాంబాబు
- వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తెలంగాణ పోలీసు శాఖ
- రాంబాబు బృందానికి స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక అభినందన
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా... మూసీకి వరద పోటెత్తింది. ఎలా పడిపోయాడో గానీ... ఓ వ్యక్తి మూసీ వరద నీటిలో కొట్టుకుపోతూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని చూసినంతనే యూనిఫాంలోనే నీటిలోకి దూకిన రాంబాబు ఆ వ్యక్తిని భుజాన వేసుకుని మరీ ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తెలంగాణ పోలీసు శాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా... వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.