చెత్తపై పన్ను చాలా ఇబ్బందిగా ఉంది.. సీఎంను కలుద్దామన్నా!: పేర్ని నానికి కొడాలి నాని ఫోన్
- గుడివాడలో 'గడప గడపకూ..' కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని
- చెత్త పన్ను భారంగా ఉందన్న ప్రజలు
- చెత్త పన్ను వసూలు చేయొద్దని మున్సిపల్ సహాయ కమిషన్ కు కొడాలి నాని ఆదేశం
చెత్త పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే గుడివాడ తొలి స్థానంలో ఉందని కొడాలి నానికి సహాయ కమిషనర్ తెలిపారు. దీంతో ఎంత వసూలవుతోందని నాని ప్రశ్నించగా.. రూ. 16 లక్షల వసూళ్లు టార్గెట్ కాగా రూ. 14 లక్షలు వసూలవుతోందని ఆయన చెప్పారు. ఈ మాత్రం దానికి ప్రజలపై పన్ను భారం వేయడం సరికాదని... ఇకపై చెత్త పన్ను వసూలు చేయవద్దని ఆదేశించారు.
మరోవైపు అక్కడి నుంచే మరో మాజీ మంత్రి పేర్ని నానికి కొడాలి నాని ఫోన్ చేశారు. 'అన్నా... చెత్త పన్ను వసూళ్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి... ఈ విషయంలో ఒకసారి సీఎంను కలుద్దాం' అని చెప్పారు.