వరంగల్ జిల్లాలో కరోనా మృతి.. కలకలం

Corona death in Warangal district
  • నాలుగు రోజుల క్రితం జ్వరం, జలుబుతో బాధపడ్డ ఇస్లావత్ మురళి
  • ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • భయంతో హడలిపోతున్న జనాలు
వరంగల్ జిల్లాలో కరోనా మహమ్మారి వల్ల ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఖానాపురం మండలం యాపచెట్టు పంచాయతీలోని కోమటిపల్లి తాండాకు చెందిన ఇస్లావత్ మురళి అనే యువకుడు కరోనాతో మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం ఇస్లావత్ మురళి అనే వ్యక్తి జ్వరం, జలుబుతో బాధపడ్డాడు. ఆయన పరిస్థితి నిన్న విషమించింది. 

దీంతో వరంగల్ లోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితిలో మార్పు రాకపోగా... మరింత విషమించింది. దీంతో ఆయనను ఎంజీఎంకు తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఈ కరోనా మృతి జిల్లాలో కలకలం రేపుతోంది. ప్రజల్లో మళ్లీ కరోనా భయం నెలకొంది.
Go Back to Shorts
Warangal
Corona
Death

More Telugu News