రెండు రాష్ట్రాల్లో 13 మంది అమ్మాయిలను మోసగించిన నిత్యపెళ్లికొడుకు శివశంకర్ బాబు అరెస్ట్

Gachibowli Police arrests Sivasankar Babu
  • శివశంకర్ బాబుపై తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులు
  • అదుపులోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు
  • ఐటీ కంపెనీలో రూ.2 లక్షల జీతమంటూ నమ్మబలికిన వైనం
  • ఒకే కాలనీలో ముగ్గురితో కాపురం
ఓ ఐటీ కంపెనీలో రూ.2 లక్షల జీతంతో ఉద్యోగం చేస్తున్నట్టు నమ్మించడం, పెళ్లి చేసుకున్న తర్వాత అందినకాడికి దండుకోవడం, గట్టిగా నిలదీస్తే పరారవడం అతడి నైజం. ఇప్పటికి ఆ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 మంది అమ్మాయిలను మోసం చేశాడు. అతడి పేరు అడపా శివశంకర్ బాబు. అతడిని హైదరాబాదు గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. 

శివశంకర్ బాబుపై హైదరాబాదు, సంగారెడ్డి, గుంటూరు జిల్లాల్లో పలు కేసులు ఉన్నాయి. అతగాడు అమెరికాలో ఉన్న ఓ యువతిని కూడా ఇలాగే మోసం చేశాడు. బాగా డబ్బున్నవారికి గాలం వేసి తన పబ్బం గడుపుకునేవాడు. విచిత్రం ఏమిటంటే, ఒకే కాలనీలో మూడు వీధుల్లో ముగ్గురితో కాపురం చేయడం అతడెంతటి ఘరానా మోసగాడో వెల్లడిస్తోంది.

శివశంకర్ బాబు స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి. ఇంజినీరింగ్ చదివిన అతడు విలాసాల కోసం మోసాల బాటపట్టాడు.
Go Back to Shorts
Sivasankar Bbau
Arrest
Police
Marriages
Telangana
Andhra Pradesh

More Telugu News