శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘే
- భారీ మెజారిటీతో గెలుపు
- 221 ఓట్లలో రణిల్ విక్రమసింఘేకు 134 ఓట్లు
- ఆరుసార్లు ప్రధానిగా పని చేసిన రణిల్
విక్రమసింఘే ఆరుసార్లు శ్రీలంక ప్రధానమంత్రిగా పని చేశారు. సంక్షోభంలో చిక్కుకున్న దేశం నుంచి పారిపోయి వారం కిందట అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గొటబాయ స్థానంలో ఆయన ఇప్పటివరకు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యహరించారు. ఇప్పుడు ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన నూతన అధ్యక్షుడిగా పూర్తి స్థాయి బాధ్యతలు అందుకోనున్నారు. ఎన్నిక తర్వాత మాట్లాడిన రణిల్ దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, తమ ముందు పెద్ద సవాళ్లు ఉన్నాయని అన్నారు.