తెలంగాణలో తాజాగా 459 కరోనా పాజిటివ్ కేసులు

Telangana corona cases
  • గత 24 గంటల్లో 22,193 కరోనా పరీక్షలు
  • మరోసారి 400కి పైచిలుకు కొత్త కేసులు
  • హైదరాబాదులో 323 మందికి పాజిటివ్
  • కరోనా నుంచి కోలుకున్న 468 మంది
  • ఇంకా 5,180 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 22,193 కరోనా పరీక్షలు నిర్వహించగా, 459 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 323 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 40, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 29 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 468 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. 

తెలంగాణలో ఇప్పటిదాకా 8,06,124 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 7,96,833 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,180 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మృతి చెందారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
New Cases
Update

More Telugu News