శ్రీలంక అధ్యక్ష భవనంలో బయటపడిన కరెన్సీ కట్టలు
- గుర్తించిన నిరసనకారులు
- వాటిని లెక్కిస్తున్న దృశ్యాలు వెలుగులోకి
- ఆచూకీ లేని అధ్యక్షుడు రాజపక్స
పెద్ద ఎత్తున నగదు అధ్యక్షుడి నివాసంలో గుర్తించారు. నగదును లెక్కిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. నిరసనకారులు అధ్యక్ష భవనంలోని స్విమ్మింగ్ పూల్ లో ఈతకొడుతూ, వ్యాయామ కేంద్రంలో కసరత్తులతో సందడి చేశారు. మిలియన్ల కొద్దీ కరెన్సీ నోట్లను గుర్తించినట్టు స్థానిక మీడియా పేర్కొంది. స్వాధీనం చేసుకున్న 17.8 మిలియన్ల నోట్లను సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించినట్టు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు తర్వాతే తాము వాస్తవాలను తెలుసుకోగలమని పోలీసులు ప్రకటించారు