నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ కు కరోనా పాజిటివ్

Amartya Sen tests positive for Corona
ఇండియాలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థికవేత్త అమర్త్యసేన్ కరోనా బారిన పడ్డారు. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం బాగుండకపోవడంతో కొవిడ్ టెస్టులు చేయించుకున్నారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. 

దీంతో ఆయన తన నివాసంలోనే సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇంటి వద్దే ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు అమర్త్యసేన్ త్వరగా కోలుకోవాలని ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.
Go Back to Shorts
Amartya Sen
Corona Virus
Positive

More Telugu News