Tammineni Sitaram: గతంలో స్పీకర్ గా ఉన్న కోడెల టీడీపీ ప్లీనరీలో పాల్గొనలేదా?: స్పీకర్ తమ్మినేని

Tammineni Sitharam attends YSRCP Plenary
షార్ట్స్‌లో చూడండి
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ ప్లీనరీలో పాల్గొన్నారు. పాలనా వికేంద్రీకరణ-పారదర్శకత అంశంపై తీర్మానం ప్రవేశపెట్టగా, మొదట తమ్మినేని సీతారాం ప్రసంగించారు. తాను పార్టీ కార్యక్రమాలకు హాజరైతే తప్పుబట్టడం మానుకోవాలని హితవు పలికారు. తాను అసెంబ్లీ స్పీకర్ ని అయినా, మొదట వైసీపీ కార్యకర్తనని తమ్మినేని స్పష్టం చేశారు. 

ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత స్పీకర్ గా విధులు నిర్వర్తించాలని సీఎం జగన్ ఆదేశిస్తే బాధ్యతలు చేపట్టానని వివరణ ఇచ్చారు. గతంలో స్పీకర్ గా ఉన్న సమయంలో కోడెల శివప్రసాదరావు టీడీపీ ప్లీనరీలో పాల్గొనలేదా? అని తమ్మినేని ప్రశ్నించారు. పార్టీ కార్యక్రమాలకు తప్పకుండా హాజరవుతానని ఉద్ఘాటించారు.
Go Back to Shorts
Tammineni Sitaram
AP Speaker
YCP Pleanary
YSRCP
CM Jagan
Andhra Pradesh

More Telugu News