జులై 1 నుంచే సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​పై​ నిషేధం.. ఇక ఇవి కనిపించవు

India to ban single use plastic from July 1
ఒకేసారి వినియోగించగలిగే ప్లాస్టిక్ (సింగిల్ యూజ్ ప్లాస్టిక్) ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. జులై 1వ తేదీ నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ మంగళవారం వెల్లడించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు స్వస్తి పలికేందుకు ప్రభుత్వం తగినంత సమయం ఇచ్చిందని మంత్రి చెప్పారు. ఒకేసారి వినియోగించగిలిగే ప్లాస్టిక్ కు దూరంగా ఉండాలని గతంలో పలుమార్లు హెచ్చరించామన్నారు. 

పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగంపై జులై 1 తేదీపై నిషేధం అమల్లోకి వస్తుంది. పాలీస్టైరిన్, పాలీస్టైరిన్ సంబంధిత వస్తువులపై నిషేధం ఉంది. 

నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తు ఉత్పత్తుల  జాబితాలో.. బెలూన్ల ప్లాస్టిక్ స్టిక్ లు, ప్లాస్టిక్ ఇయర్ బడ్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్, క్యాండీ స్టిక్స్, ప్లాస్టిక్ కప్స్, ప్లాస్టిక్ గ్లాసులు ప్రధానమైంది. వీటితో పాటు 100 మైక్రాన్ల కంటే తక్కువగా ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు, ప్లాస్టిక్ స్పూన్ లు, పోర్కులు ఇకపై కనిపించవు. అలాగే, స్వీట్ బాక్స్ లు, సిగరెట్ ప్యాకెట్లు, ఇన్విటేషన్ కార్డులపై అలంకరణ కోసం వాడే వ్రాపింగ్ ప్లాస్టిక్ ఫిల్మ్ లు కూడా నిషేధిత జాబితాలో చేర్చారు.
Go Back to Shorts
single use plastic
ban
india
environment
july
central govt
baloons
candy
plastic glases

More Telugu News