చికెన్‌తో వంకాయ క‌ర్రీ వ‌డ్డింపు!.. సిద్దిపేట గురుకుల పాఠశాల‌లో ఫుడ్ పాయిజ‌న్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చికెన్‌తో వంకాయ క‌ర్రీ వ‌డ్డింపు!.. సిద్దిపేట గురుకుల పాఠశాల‌లో ఫుడ్ పాయిజ‌న్‌!

  • 107 మందికి తీవ్ర అస్వ‌స్థ‌త‌
  • ఆసుప‌త్రికి తర‌లించిన అధికారులు
  • ఘ‌ట‌న‌పై మంత్రి హ‌రీశ్ రావు ఆరా
తెలంగాణ గురుకుల పాఠ‌శాల‌లో సోమ‌వారం ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మంత్రి హ‌రీశ్ రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిద్ధిపేట‌లోని మైనారిటీ గురుకుల పాఠ‌శాల‌లో వెలుగు చూసిన ఈ ఘ‌ట‌న‌లో 107 మంది విద్యార్థులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న హ‌రీశ్ రావు అధికారుల‌ను ఆరా తీశారు. విద్యార్థుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... ఈ పాఠశాల‌లో ఆదివారం రాత్రి చికెన్‌తో క‌లిపి వంకాయ‌ను వ‌డ్డించార‌ట‌. ఆ వెంట‌నే విద్యార్థుల‌కు వాంతులు, విరేచ‌నాలు అయ్యాయి. ఆ త‌ర్వాత ఆదివారం రాత్రి నుంచి విద్యార్థులు క‌డుపు నొప్పితో బాధ‌ప‌డుతున్నారు. తీరా సోమవారం నాటికి వారికి క‌డుపు నొప్పి తీవ్రం కావ‌డంతో వారంతా అధికారుల‌కు తెలిపారు. దీంతో హుటాహుటీన అధికారులు విద్యార్థుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.
Telangana
Siddipet District
Harish Rao
TRS
Food Poison

More Telugu News