తెలంగాణలో తాజాగా 434 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 27,754 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 292 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 129 మంది
- ఇంకా 2,680 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటిదాకా 7,97,138 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 7,90,347 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,680 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
