అమెరికాలోని అలబామా చర్చిలో కాల్పులు.. ఒకరి మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలోని అలబామా చర్చిలో కాల్పులు.. ఒకరి మృతి

1 dead and 2 injured in Alabama church shooting
  • సెయింట్ స్టీఫెన్స్ ఎపిస్కోపల్ చర్చిలో కాల్పులు
  • పోలీసుల అదుపులో నిందితుడు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
అమెరికాలో తుపాకుల మోతకు తెరపడడం లేదు. ఇటీవల టెక్సాస్‌లో ఓ స్కూల్‌లోకి చొరబడిన సాయుధుడు జరిపిన కాల్పుల్లో టీచర్ సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కూడా న్యూయార్క్, ఉవాల్డే, టెక్సాస్ నగరాల్లోనూ కాల్పులు జరిగాయి. తాజాగా నిన్న సాయంత్రం అలబామాలోని ఓ చర్చిలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

బర్మింగ్‌హామ్ సబర్బ్‌ వెస్టావియా హిల్స్‌లో ఉన్న సెయింట్ స్టీఫెన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని గుర్తించాల్సి ఉంది.  నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.
America
Alabama
Saint Stephen’s Episcopal Church
Alabama Shooting

More Telugu News