గుడివాడ ఫ్లై ఓవర్లను అడ్డుకుంటున్నారంటూ పురందేశ్వరిపై కొడాలి నాని ఆరోపణ
- గుడివాడకు కేంద్రం పలు ఫ్లై ఓవర్లను ప్రకటించిందన్న నాని
- అభివృద్ది పనులను అడ్డుకునే యత్నాలను విరమించాలని సూచన
- లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక
ఈ మేరకు సోమవారం ఈ అంశాన్ని మీడియా ముందు ప్రస్తావించిన నాని... పురందేశ్వరికి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికైనా గుడివాడ అభివృద్ది పనులను అడ్డుకునే యత్నాలను విరమించాలని ఆయన పురందేశ్వరికి సూచించారు. లేనిపక్షంలో పురందేశ్వరి తీవ్ర పరిణామాలకు సిద్ధం కావాల్సి ఉంటుందని నాని హెచ్చరించారు.