తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న 'ఏనుగు'
- ఈ నెల 17న విడుదలవుతున్న 'ఏనుగు'
- అరుణ్ విజయ్, ప్రియా భవాని శంకర్, సముద్రఖని ప్రధాన పాత్రలను పోషించిన చిత్రం
- తమిళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన 'యానై'కు ఇది తెలుగు వర్షన్
'ఏనుగు' చిత్రంలో అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, కేజీఎఫ్ రామచంద్రరాజు, రాధిక శరత్ కుమార్, యోగిబాబు, అమ్ము అభిరామి వంటి నటులు నటించారు. దర్శకుడు హరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళ స్టార్ హీరో సూర్యతో 'సింగం' సిరీస్, విశాల్ తో 'పూజ' వంటి యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను ఆయన ఆకట్టుకున్నారు.
ఈ నెల 12న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. 17న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా సతీశ్ కుమార్ మాట్లాడుతూ... మంచి కంటెంట్ తో ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని తెలిపారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 12 న జరుపుకొని ఇదే నెల 17 న గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. సహ నిర్మాతగా వేదికకారన్ పట్టి ఎస్. శక్తివేల్ వ్యవహరిస్తున్నారు.