జీరో పెర్ఫార్మెన్స్‌తో ఏడుగురు ఎమ్మెల్యేలు... టికెట్లు ఇచ్చేది లేద‌న్న జ‌గ‌న్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జీరో పెర్ఫార్మెన్స్‌తో ఏడుగురు ఎమ్మెల్యేలు... టికెట్లు ఇచ్చేది లేద‌న్న జ‌గ‌న్‌

ysrcp chief jagan warnings to poor performance mlas in gadapagadapaku review
  • గ‌డ‌ప‌గ‌డ‌ప‌కుపై తాడేప‌ల్లిలో జ‌గ‌న్ స‌మీక్ష‌
  • ప‌నితీరు బాగా లేని నేత‌ల‌కు జ‌గ‌న్ హెచ్చ‌రిక‌లు
  • ప‌నితీరు మెరుగుప‌ర‌చుకోకుంటే టికెట్లు ఇచ్చేది లేద‌ని వెల్ల‌డి
ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఇటీవ‌లే మొద‌లుపెట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బుధ‌వారం స‌మీక్షిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టిదాకా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పార్టీ నేత‌ల‌కు ఎదురైన అనుభ‌వాలు, ప్ర‌జ‌లు ప్ర‌ధానంగా ప్ర‌స్తావించిన అంశాలు, కార్య‌క్ర‌మాన్ని మ‌రింత మెరుగ్గా నిర్వ‌హించ‌డం ఎలా అన్న అంశాల‌పై చ‌ర్చించేందుకే జ‌గ‌న్ ఈ స‌మీక్ష‌ను నిర్వ‌హిస్తున్నార‌న్న విష‌యం తెలిసిందే. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జరుగుతున్న ఈ స‌మీక్ష‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్లు, జిల్లాల అధ్య‌క్షులు, నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీలు హాజ‌ర‌య్యారు.

ఈ స‌మీక్ష‌కు ముందే... గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో పార్టీ నేత‌ల ప‌నితీరుపై జ‌గ‌న్ ఓ నివేదిక తెప్పించుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా బుధ‌వారం నాటి స‌మీక్ష‌లో జ‌గ‌న్ ఆ నివేదిక‌ను బ‌య‌ట‌కు తీశారు. ఈ నివేదిక‌లో ప‌లువురి ప‌నితీరు బాగానే ఉన్నా...ఓ ఏడుగురు ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ జీరోగా ఉందట‌. ఈ ఏడుగురు ఇళ్లు క‌ద‌ల‌కుండానే... త‌మ అనుచ‌రుల‌ను పంపుతూ కార్య‌క్ర‌మాన్ని నెట్టుకొస్తున్నార‌ట‌. ఈ విష‌యాన్ని బ‌హిరంగంగానే వెల్ల‌డించిన జ‌గ‌న్‌... ఇలాగైతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇచ్చేది లేద‌ని తేల్చి చెప్పినట్టు సమాచారం. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే వారికే టికెట్లు ఇస్తామ‌ని జగ‌న్ స్పష్టం చేశారు. 
YSRCP
YS Jagan
Andhra Pradesh

More Telugu News