ట్రాక్ట‌ర్ నడిపిన మంత్రి రోజా... ప‌వ‌న్, చంద్ర‌బాబుల‌పై సెటైర్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ట్రాక్ట‌ర్ నడిపిన మంత్రి రోజా... ప‌వ‌న్, చంద్ర‌బాబుల‌పై సెటైర్లు

apminister rk roja satires on chandrababu and pawan kalyan
  • వైఎస్సార్ యంత్ర సేవా కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన జ‌గన్‌
  • న‌గ‌రి నుంచి పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా
  • పొత్తులు లేకుండా చంద్ర‌బాబు పోటీ చేయ‌లేరని వ్యాఖ్య‌
  • ప‌వ‌న్ రీల్ హీరో మాత్ర‌మే, రియ‌ల్ హీరో కాలేరన్న రోజా
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం మ‌రో కొత్త ప‌థ‌కానికి శ్రీకారం చుట్టింది. వైఎస్సార్ యంత్ర సేవా పేరిట మంగ‌ళ‌వారం సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ ప‌థ‌కానికి గుంటూరు జిల్లాలో శ్రీకారం చుట్ట‌గా... జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రిగా కొన‌సాగుతున్న రోజా త‌న సొంత నియోజ‌కవ‌ర్గం న‌గ‌రి నుంచి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాదిరే ఉత్సాహంగా ట్రాక్ట‌ర్ ఎక్కిన రోజా స్వ‌యంగా ట్రాక్ట‌ర్ న‌డిపారు. 

ఈ సంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధుల‌తో ఆమె మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ లపై పంచ్‌లు విసిరారు. టీడీపీ, జ‌న‌సేన‌తో పాటు ఎన్ని పార్టీలు గుంపులు గుంపులుగా వ‌చ్చినా జ‌గ‌న్ అనే సింహం సింగిల్‌గానే వ‌స్తుంద‌ని ఆమె చెప్పారు. 

ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌నే ఆలోచన ఉందా? లేదంటే ప‌ద‌వులే ప‌ర‌మావ‌ధిగా పెట్టుకున్నారా? అన్న విష‌యంపై ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పాటు చంద్రబాబు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆమె చెప్పారు. చంద్ర‌బాబు ఎప్పుడూ ఒంట‌రిగా పోరాటం చేసే నేత కాద‌ని, నిత్యం ఆయ‌న పొత్తుల‌తోనే ముందుకు సాగుతున్నార‌న్నారు. రియ‌ల్ లైఫ్‌లో రియ‌ల్ హీరో జ‌గ‌నేన‌ని చెప్పిన రోజా.. ప‌వ‌న్ రీల్ హీరో మాత్ర‌మేన‌ని, ఆయ‌న రియ‌ల్ హీరో కాలేర‌ని తేల్చి చెప్పారు. ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా వార్ వ‌న్ సైడ్ అన్న‌ట్లుగానే ఉంటుంద‌ని రోజా చెప్పుకొచ్చారు.
YSRCP
YS Jagan
RK Roja
Ysr Yantra Seva
Nagari

More Telugu News