పవన్ కల్యాణ్ కు రూ. 1,000 కోట్ల ఆఫర్ ప్రకటించిన కేఏ పాల్
Add ap7am to your home Screen

పవన్ కల్యాణ్ కు రూ. 1,000 కోట్ల ఆఫర్ ప్రకటించిన కేఏ పాల్

KA Paul gives bumper offer to Pawan Kalyan
  • పవన్ తమ పార్టీలో చేరాలని కోరిన పాల్ 
  • ఎంపీగానో, ఎమ్మెల్యేగానో గెలిపిస్తామని హామీ 
  • సొంతంగా కానీ, మరో పార్టీతో కానీ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే గెలవలేరని వ్యాఖ్య 
జనసేనాని పవన్ కల్యాణ్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇస్తూ తమ పార్టీలోకి ఆహ్వానం పలికారు. పవన్ తన సొంత పార్టీ జనసేనను వదిలిపెట్టి తమ పార్టీలో చేరితే... ఎంపీగానో, ఎమ్మెల్యేగానో గెలిపిస్తామని చెప్పారు. 

ఒకవేళ పవన్ ను గెలిపించలేకపోతే రూ. 1,000 కోట్ల నజరానా ఇస్తానని ఆయన ప్రకటించారు. ఇదే సమయంలో పవన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ సొంతంగా పోటీ చేసినా, మరో పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా ఎన్నికల్లో గెలవలేడని చెప్పారు. బీజేపీతో చేతులు కలిపిన పవన్ కల్యాణ్... బైబిల్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలిపారు.
KA Paul
Pawan Kalyan
Janasena

More Telugu News