'అంటే .. సుందరానికీ' నుంచి ట్రైలర్ రిలీజ్!
- నాని తాజా చిత్రంగా 'అంటే .. సుందరానికీ'
- ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతున్న నజ్రియా
- వినోదమే ప్రధానంగా సాగే కథ
- ఈ నెల 10వ తేదీన సినిమా విడుదల
'బ్రోచేవారెవరురా' సినిమాతో హిట్ కొట్టిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో తెలుగు తెరకి నజ్రియా నజీమ్ పరిచయం కానుంది. వివేక్ సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ఈ కథలో హీరో హీరోయిన్ల కులమతాలు వేరు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో వాళ్లు ఒక ప్లాన్ చేస్తారు. పర్యవసానంగా వాళ్లకి ఎదురయ్యే పరిణామాలే ఈ సినిమా. అందుకు సంబంధించిన సన్నివేశాలపైనే ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.