విజయవాడలో ఫుట్ బాల్ ప్లేయర్ దారుణ హత్య

Foot Ball player murdered in Vijayawada
  • గురునానక్ కాలనీలో ఫుట్ బాల్ ప్లేయర్ ఆకాశ్ హత్య
  • కత్తులతో దాడి చేసిన ప్రత్యర్థులు
  • అక్కడికక్కడే మృతి చెందిన ఆకాశ్
విజయవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురునానక్ కాలనీలో జక్కంపూడికి చెందిన ఫుట్ బాల్ ప్లేయర్ ఆకాశ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే రౌడీ షీటర్ టోనీ రెండు రోజుల క్రితం వాంబే కాలనీలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టోనీ గ్యాంగ్ లో ఆకాశ్, ప్రభాకర్ తో పాటు మరి కొందరు పని చేస్తున్నారు. 

ఈ క్రమంలో టోనీ అంత్యక్రియల తర్వాత అందరూ కలిసి ఓ బార్ లో మద్యం సేవించారు. ఈ సందర్భంగా ఆకాశ్, ప్రభాకర్ గ్రూపుల మధ్య వివాదం తలెత్తింది. అంతలోనే అక్కడకు పోలీసులు రావడంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీని తర్వాత నిన్న రాత్రి ప్రభాకర్ గ్యాంగ్ సభ్యులు ఆకాశ్ ఇంటి వద్దకు వెళ్లి అతనిపై కత్తులతో దాడి చేశారు. 

ఈ దాడిలో ఆకాశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటి వరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. టోనీ అంత్యక్రియలకు ఎవరెవరు హాజరయ్యారనే దానిపై దృష్టి సారించారు. మరోవైపు ఫుట్ బాల్ ప్లేయర్ గా ఆకాశ్ కొన్ని టోర్నీల్లో కప్ లను సాధించాడు.
Go Back to Shorts
Vijayawada
Foot Ball Player
Murder

More Telugu News