TG Venkatesh: అమ‌రావతి భ‌జ‌న‌తో టీడీపీ దెబ్బతిన్న‌ది: బీజేపీ ఎంపీ టీజీ వెంక‌టేశ్

tg venkates comments on tdp and ysrcp
షార్ట్స్‌లో చూడండి
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిని కేంద్రంగా చేసుకుని బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేశ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అమరావ‌తి అంశం ఆధారంగా జ‌రుగుతున్న రాజ‌కీయం టీడీపీకి న‌ష్టాన్ని మిగుల్చుతుండ‌గా... వైసీపీ మాత్రం లాభ‌ప‌డుతోంద‌న్న దిశ‌గా ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం ముగియ‌నున్న నేప‌థ్యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

అమ‌రావ‌తి భ‌జ‌న‌తో టీడీపీ ఇత‌ర ప్రాంతాల్లో దెబ్బతిన్న‌ద‌ని టీజీ వెంక‌టేశ్ పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో అమ‌రావతి వ్య‌తిరేక నినాదంతో వైసీపీ ముందుకు వెళుతోంద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. వైసీపీ నినాదం రాష్ట్రాభివృద్ధి కాద‌న్న టీజీ.. అమ‌రావ‌తి వ్య‌తిరేక వాద‌మే ఆ పార్టీ నినాదంగా మారింద‌న్నారు. కేంద్ర నిధులు, ప‌థ‌కాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం స‌రిగా వినియోగించుకోవ‌డం లేద‌ని టీజీ వెంక‌టేశ్ ఆరోపించారు.
Go Back to Shorts
TG Venkatesh
BJP
TDP
YSRCP
Amaravati
Rajya Sabha MP

More Telugu News