కొండాపూర్ లో యువతిపై నలుగురు యువకులతో దాడి చేయించిన వివాహిత
- కొండాపూర్ లో ఉంటున్న శ్రీకాంత్, గాయత్రి
- శ్రీకాంత్ కు మరో యువతితో స్నేహం
- భర్తను వలలో వేసుకుందని ఆ యువతిపై గాయత్రి అనుమానం
- నమ్మకంగా ఇంటికి పిలిచి బంధించిన వైనం
అయితే, గాయత్రి సదరు యువతిపై అనుమానం పెంచుకుంది. తన భర్తతో సంబంధం ఉందని భావించి, ఈ నెల 26న ఆ యువతిని నమ్మకంగా ఇంటికి పిలిచింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆ యువతిని ఓ గదిలో బంధించింది. ఆపై, నలుగురు యువకులతో ఆ యువతిపై దాడి చేయించింది. ఆ యువకులు బాధిత యువతి నోటికి ప్లాస్టర్ వేసి తీవ్రంగా హింసించారు. ఈ తతంగాన్ని గాయత్రి తన మొబైల్ ఫోన్ లో వీడియోగా చిత్రీకరించింది. తన భర్త జోలికి వస్తే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతానని ఆ యువతిని బెదిరించింది.
కాగా, గాయాలపాలైన ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, జరిగిన ఘాతుకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయత్రిని, ఆమెకు సహకరించిన నలుగురు యువకులను అరెస్ట్ చేశారు.