దుష్టశక్తులను తరిమివేస్తానంటూ మహిళలను కొరడాతో తాట లేచిపోయేట్టు కొట్టిన పూజారి!
- తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో ఘటన
- నరైకినర్ గ్రామంలో ఉత్సవాలు
- భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలు
- పూజారి చేతిలో కొరడా దెబ్బలు తిన్న మహిళలు
నరైకినర్ గ్రామంలోని వరదరాజపెరుమాళ్ చెల్లియమ్మన్ మారియమ్మన్ ఆలయంలో వేడుకల సందర్భంగా పూజారి పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. ఓ కొరడా తీసుకుని మహిళలను తాట ఊడి వచ్చేట్టు కొట్టాడు. ఆ విధంగా కొట్టడం అక్కడి ఆచారం. పూజారి కొరడాతో కొడితే క్షుద్రశక్తులు పారిపోతాయని అక్కడి వారి నమ్మిక. దాంతో పెద్ద ఎత్తున మహిళలు ముందుకొచ్చి పూజారితో కొరడా దెబ్బలు తిన్నారు.