మసీదులు తవ్వడాన్ని పక్కన పెట్టి.. కేంద్రం నుంచి నిధులు తీసుకురండి: గంగుల కమలాకర్
- తెలంగాణలో మసీదులను తవ్వాలన్న బండి సంజయ్
- మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దన్న గంగుల
- ఇతర మతాలను గౌరవించాలని సూచన
తెలంగాణలో ఇప్పటి వరకు మతకలహాలు లేవని... ఇకపై కూడా రాష్ట్రం ప్రశాంతంగానే ఉండాలని చెప్పారు. మత కలహాలు ఉన్న ప్రాంతం అభివృద్ధికి నోచుకోదని... దీనికి గుజరాత్ ఉదాహరణ అని చెప్పారు. మసీదులను తవ్వడాన్ని పక్కన పెట్టి, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులను తీసుకురావడంపై బండి సంజయ్ దృష్టి సారించాలని అన్నారు. ఇతర మతాలను గౌరవించడాన్ని నేర్చుకోవాలని... రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని చెప్పారు.