దేశంలో మరిన్ని తగ్గిన కరోనాకేసులు ...అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 1,675 కేసుల నమోదు
- ఇదే సమయంలో 31 మంది మృతి
- 15 వేల దిగువకు వచ్చిన యాక్టివ్ కేసులు
తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 4,31,40,168కి చేరుకుంది. వీరిలో 4,26,00,737 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 5,24,490 మంది మహమ్మారికి బలయ్యారు. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. క్రియాశీల రేటు 0.03 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 1,92,52,70,955 డోసుల కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 13.76 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.