ఢిల్లీ చేరిన సీఎం కేసీఆర్.. టూర్‌లో 4 రోజుల పాటు ఛండీగఢ్‌లో పర్యటన
- రాత్రికి ఢిల్లీలోనే బస
- శనివారం వరుస భేటీలు నిర్వహించనున్న కేసీఆర్
- ఆదివారం ఛండీగఢ్‌కు వెళ్లనున్న సీఎం
- కేసీఆర్ వెంట ఆప్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్
- ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సాయం
తన పర్యటనలో భాగంగా ఆదివారం ఛండీగఢ్ వెళ్లనున్న కేసీఆర్ అక్కడే ఏకంగా నాలుగు రోజుల పాటు గడపనున్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో మృతి చెందిన రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఈ పర్యటనలో కేసీఆర్ వెంట ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌లు పాల్గొంటారు. మృతి చెందిన రైతుల కుటుంబాలకు కేసీఆర్ రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు.