TDP: త‌న వ‌య‌సు, స్ఫూర్తిపై చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

chandrababu commets on his age
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు బుధ‌వారం క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించారు. క‌డ‌ప‌లో నిర్వ‌హించిన బాదుడే బాదుడు కార్య‌క్ర‌మంలో పాలుపంచుకున్న ఆయ‌న అనంత‌రం జిల్లాలోని మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఖాజీపేట‌కు వెళ్ల‌గా... ఆయ‌న‌కు పార్టీ శ్రేణులు ఘ‌న స్వాగ‌తం ప‌లికాయి. ఈ సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌ల ఉత్సాహాన్ని చూసిన చంద్ర‌బాబు... త‌న వ‌య‌సు, స్ఫూర్తిపై ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

నా వ‌య‌సు 72 ఏళ్లు..అయితే నా స్ఫూర్తి మాత్రం 27 అంటూ చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. వైసీపీ పాల‌న‌లో ఒక్క‌రికీ ఉద్యోగం రాలేద‌న్న చంద్ర‌బాబు... జాబ్ కేలండ‌ర్ ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. ఈ ప్ర‌భుత్వం క‌డ‌ప జిల్లాకు ఒక్క ప‌రిశ్ర‌మ‌నైనా తెచ్చిందా? అని కూడా చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. తాము అధికారంలోకి వ‌స్తే ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల‌లో యువ‌త‌కు అధిక ప్రాధాన్య‌మిస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.
Go Back to Shorts
TDP
Chandrababu
Kadapa District

More Telugu News