చాలా పెద్ద తప్పు చేస్తున్నారు: ఫిన్లాండ్, స్వీడన్ లకు రష్యా వార్నింగ్
- నాటోలో చేరాలని నిర్ణయించుకున్న ఫిన్లాండ్, స్వీడన్
- తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని హెచ్చరించిన రష్యా
- ఆలోచన కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపాటు
ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల్లో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే ఆలోచన కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాము చూస్తూ ఊరుకుంటామనే భ్రమల్లో నుంచి వారు బయటకు రావాలని అన్నారు. రష్యాతో ఫిన్లాండ్ దాదాపు 1,300 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ దేశం నాటోలో చేరితే తమ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని రష్యా భావిస్తోంది. ఇదే కారణం వల్లే ఉక్రెయిన్ పై రష్యా దండెత్తింది.