Sajjala Ramakrishna Reddy: మీకు దమ్ముంటే ఆ వీడియోలను విడుదల చేయండి: టీడీపీ నేతలకు సజ్జల సవాల్

ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, ఇటీవల పరిణామాల నేపథ్యంలో అధికార వైసీపీ నేతలపై టీడీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. టీడీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ గా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా స్పందించారు. అభివృద్ధి చేశాం కాబట్టే ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నామని స్పష్టం చేశారు. ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు.  'గడప గడప'ను ప్రజలు అడ్డుకుంటున్నారంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట అని వ్యాఖ్యానించారు. 

తాము ఎక్కడికి వెళ్లినా ప్రజలు సాదరంగా స్వాగతం పలుకుతున్నారని, రోజంతా ప్రజలతో మాట్లాడింది రికార్డు చేయాలన్నారు. దమ్ముంటే ఆ వీడియోలను విడుదల చేయండి అంటూ టీడీపీ నేతలకు సజ్జల సవాల్ విసిరారు. ప్రజల్లో టీడీపీ వాళ్లు కూడా ఉంటారని, వాళ్లే ప్రశ్నించి వాళ్లే ప్రచారం చేసుకుంటారని వివరించారు. జరిగేదంతా భూతద్దంలో చూపిస్తున్నారని విమర్శించారు.
Sajjala Ramakrishna Reddy
TDP Leaders
YSRCP
Andhra Pradesh

More Telugu News