ఎల్ఐసీ ఐపీఓకు భారీ స్పంద‌న‌.. టాప్‌లో పాల‌సీ హోల్డ‌ర్లే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎల్ఐసీ ఐపీఓకు భారీ స్పంద‌న‌.. టాప్‌లో పాల‌సీ హోల్డ‌ర్లే

lic ipo concluded on monday
  • సోమ‌వారంతో ముగిసిన ఐపీఓ
  • 2.95 రెట్ల మేర ఓవ‌ర్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌
  • 16.20 కోట్ల షేర్ల‌కు 47.83 కోట్ల బిడ్లు
భార‌త ప్ర‌భుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) పబ్లిక్ ఆఫర్‌కు మ‌దుప‌రుల నుంచి భారీ స్పంద‌న ల‌భించింది. సంస్థ‌కు చెందిన 16.20 కోట్ల షేర్ల‌ను ప‌బ్లిక్‌కు ఆఫ‌ర్ చేయ‌గా... 2.95 రెట్ల మేర బిడ్లు దాఖల‌య్యాయి. సోమ‌వారంతో ఎల్ఐసీ ఐపీఓ గ‌డువు ముగియ‌గా... 16.20 కోట్ల షేర్ల‌కు ఏకంగా 47.83 కోట్ల బిడ్లు దాఖల‌య్యాయి.

ఎల్ఐసీ ఐపీఓలో బ‌య‌టి వ్య‌క్తుల కంటే కూడా సంస్థ పాల‌సీ హోల్డ‌ర్లే టాప్ బిడ్ద‌ర్లుగా నిలిచారు. ఓవ‌రాల్‌గా 2.95 రెట్ల ఓవ‌ర్ స‌బ్‌స్క్రిప్ష‌న్ న‌మోదు కాగా... పాల‌సీ హోల్డ‌ర్ల జాబితాలో ఇది ఏకంగా 6.12 రెట్లు న‌మోదైంది. ఇక రిటైల్ ఇన్వెస్ట‌ర్లు ఈ ఐపీఓలో 1.99 రెట్లతో దిగువ స్థానంలో నిలిచారు. మొత్తంగా ఏ విభాగంలో చూసినా ఓవ‌ర్ స‌బ్‌స్క్రిప్ష‌న్ న‌మోదైన ఎల్ఐసీ ఐపీఓ గ్రాండ్ స‌క్సెస్ అన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

LIC
IPO
Policy Holders

More Telugu News