'అంటే .. సుందరానికీ' నుంచి సాంగ్ రిలీజ్!
- నాని నుంచి మరో విభిన్నమైన సినిమా
- కథానాయికగా నజ్రియా పరిచయం
- ఓ మాదిరిగా అనిపిస్తున్న వివేక్ సాగర్ బాణీ
- జూన్ 10వ తేదీన సినిమా విడుదల
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. 'ఎంత చిత్రం.. ఎన్నేసి జ్ఞాపకాలు .. ఊపిరాడేదెలా.. ఎంతమాత్రం ఊహలో లేని ఉత్సవాలలో మునిగి తేలా' అంటూ ఈ పాట సాగుతోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి - కీర్తన ఆలపించారు.
లిరికల్ సాంగ్ చూస్తే ట్యూన్ అంతగా పట్టనట్టుగా అనిపిస్తుంది. కాస్త గందరగోళంగాను అనిపిస్తుంది. సినిమాలో సందర్భాన్ని బట్టి వస్తుంది గనుక ఏమైనా ఎక్కుతుందేమో చూడాలి. నదియా .. రోహిణి .. నరేశ్ .. సుహాస్ .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.