డిక్లరేషన్‌పై టీఆర్ఎస్, బీజేపీలకు ఉలికిపాటు ఎందుకు?: టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి
- కాంగ్రెస్ డిక్లరేషన్‌తో రైతుల్లో సంతోషం ఉందన్న మల్లు రవి
- రాహుల్ గాంధీపై విమర్శలు మానుకోకపోతే ప్రజలు ప్రతిఘటిస్తారని హెచ్చరిక
- టీఆర్ఎస్ను ప్రజలు గద్దె దింపుతారన్న మల్లు రవి
రాహుల్ గాంధీపై టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ప్రజలు హర్షించడం లేదని మల్లు రవి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీపై టీఆర్ఎస్తో పాటు బీజేపీలు విమర్శలు మానుకోకపోతే ఆ రెండు పార్టీలకు ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను ప్రజలు గద్దె దింపుతారని ఆయన అన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.