ఓ పార్టీలో ఓటుకు నోటు... ఇంకో పార్టీలో సీఎం సీటుకు నోటు: హరీశ్ రావు దెప్పిపొడుపు
- రూ.2,500 కోట్లు ఇస్తే కర్ణాటక సీఎం సీటు వస్తదట అన్న హరీశ్
- ఈ విషయాన్ని బీజేపీ ఎంపీనే చెప్పారని వ్యాఖ్య
- ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్న హరీశ్
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. ఒక పార్టీలో ఓటుకు నోటు పంచాయితీ ఉంటే.. ఇంకో పార్టీలో సీఎం సీటుకు నోటు పంచాయితీ ఉందని విమర్శించారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రూ.2,500 కోట్లు ఇస్తే వస్తదట అంటూ వ్యాఖ్యానించిన హరీశ్.. ఇది మనం అనడం లేదని, కర్ణాటక బీజేపీ ఎంపీనే చెబుతున్నాడని గుర్తు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరో మీకు తెలుసన్న హరీశ్.. ఓటుకు నోటు కేసులో ఆయన ముద్దాయి అని పేర్కొన్నారు. ఇలాంటి పార్టీలతో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.