అభినందనలు చెప్పిన వారందరికీ ధన్యవాదాలు: కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు
- ఓక్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న హిమాన్షు
- గత వారం జరిగిన ఎన్నికల్లో సీఏఎస్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక
- సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆయనకు చాలా మంది అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా తనకు అభినందనలు చెప్పిన వారందరికీ హిమాన్షు సోమవారం ఉదయం ధన్యవాదాలు తెలుపుతూ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. తనకు ఆది నుంచి మద్దతుగా నిలిచిన వారందరికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మీ దీవెనలతోనే ప్రభావితమయ్యానన్న హిమాన్షు.. తాను మరింతగా శక్తిమంతం అయ్యేలా అందరి దీవెనలు తనకు ఎల్లప్పుడూ తోడుంటాయని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.