హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డా... కాసేపట్లో 'జనం ఘోష.. బీజేపీ భరోసా' సభకు పయనం
- నేటితో ముగియనున్న బండి సంజయ్ పాదయాత్ర
- మహబూబ్ నగర్‌లో భారీ బహిరంగ సభ
- ఈ సభకు హాజరయ్యేందుకే తెలంగాణకు జేపీ నడ్డా
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కొనసాగిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర గురువారం నాడు ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర ముగింపు సందర్భంగా మహబూబ్‌నగర్‌లో 'జనం ఘోష...బీజేపీ భరోసా' పేరిట భారీ బహిరంగ సభను బీజేపీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు హాజరయ్యేందుకే జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు వచ్చారు. మరికాసేపట్లో ఆయన శంషాబాద్ నుంచి మహబూబ్ నగర్ కు బయలుదేరనున్నారు.