Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దుమ్మురేపిన టాపార్డర్... లక్నో భారీ స్కోరు

Top order hammers as LSG registers huge total
  • వాంఖెడే స్టేడియంలో లక్నో వర్సెస్ ఢిల్లీ
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో
  • కేఎల్ రాహుల్, దీపక్ హుడా అర్ధసెంచరీలు
  • 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 రన్స్ చేసిన లక్నో
ఢిల్లీ క్యాపిటల్స్ తో పోరులో లక్నో సూపర్ జెయింట్స్ టాపార్డర్ సత్తా చాటింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా అర్ధసెంచరీలతో రాణించగా, లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 77 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 4 ఫోర్లు, 5 సిక్సులున్నాయి. వన్ డౌన్ లో వచ్చిన దీపక్ హుడా 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 52 పరుగులు చేశాడు. 

అంతకుముందు ఓపెనర్ క్వింటన్ డికాక్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 23 పరుగులు చేశాడు. చివర్లో ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ 17 పరుగులు సాధించాడు. లక్నో కోల్పోయిన మూడు వికెట్లు మీడియం పేసర్ శార్దూల్ ఠాకూర్ ఖాతాలోకి చేరాయి.
LSG
Top Order
KL Rahul
Deepak Hooda
Delhi Capitals
IPL

More Telugu News