పంజాబ్ లో ఉద్రిక్త‌త‌లు.. మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్‌ సేవల నిలిపివేత‌

30-04-2022 Sat 11:45 | National
  • పటియాలాలో నిన్న‌ కాళీ మందిర్‌ ప్రాంతంలో ఘ‌ర్ష‌ణ‌
  • శివసేన నేతలు, ఖలిస్థాన్ మ‌ద్ద‌తుదారుల మ‌ధ్య గొడ‌వ‌
  • పోటాపోటీగా ర్యాలీలు, రాళ్ల‌తో దాడులు
పంజాబ్ లోని పటియాలాలో నిన్న‌ కాళీ మందిర్‌ ప్రాంతంలో శివసేన నేతలు, ఖలిస్థాన్ మ‌ద్ద‌తుదారుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకోవ‌డం తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. ఖలిస్థాన్ మ‌ద్ద‌తు దారులు, శివ‌సేన కార్య‌క‌ర్త‌లు నిన్న పోటీగా ర్యాలీలు చేపట్టడంతో ఈ ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. 

ఇరు వర్గాలు క‌త్తుల‌తో వీరంగం సృష్టించ‌డం, రాళ్ల దాడి చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపాయి. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో పటియాలాకు అదనపు బలగాలను ర‌ప్పించారు.  ఉద్రిక్త ప‌రిస్థితులు చ‌ల్లార‌క‌పోవ‌డం, వదంతులు వ్యాపిస్తుండ‌డంతో సీఎం భగవంత్‌ మాన్ కీల‌క‌ నిర్ణయం తీసుకున్నారు. శాంతి భద్రతల విషయంలో వైఫల్యం చెందార‌ని, హింసను నియంత్రించడంలో విఫలమయ్యార‌ని ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై భగవంత్‌ మాన్‌ సర్కార్ చ‌ర్య‌లు తీసుకుంది. 

పటియాలా రేంజ్ ఐజీతో పాటు ఎస్‌ఎస్‌పీ, ఎస్‌పీలను బదిలీ చేశారు. కాగా,  పోలీసులు ప‌టియాలాలో నిన్న‌ రాత్రి 7 గంటల నుంచి ఈ రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ప‌రిస్థితులు ఇప్ప‌టికీ అలాగే ఉండ‌డంతో ఈ రోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాయిస్ కాల్స్ మినహా మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్‌ సేవలను నిలిపివేస్తున్నట్టు పంజాబ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.
PunjabCrime NewsPolice

More Telugu News

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55
..more