'దంగల్ ' రికార్డుకి దగ్గరలో 'కేజీఎఫ్ 2'
- ఈ నెల 14వ తేదీన విడుదలైన 'కేజీఎఫ్ 2'
- విడుదలైన ప్రతి భాషలో విజయవిహారం
- కొత్త రికార్డుల దిశగా దూకుడు
- శ్రీనిధి శెట్టికి పెరుగుతున్న అవకాశాలు
హిందీలో ఈ సినిమా ఇప్పటికే 330 కోట్ల వసూళ్లను దాటేసింది. ఇప్పటివరకూ 'దంగల్' పేరుతో ఉన్న రికార్డును ఈ సినిమా సొంతం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టదని అంటున్నారు. ఆ సినిమా రికార్డు చేరువలోకి ఈ సినిమా వచ్చేసిందని చెబుతున్నారు. ఆ సమయం కోసం యశ్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకి కథానాయికగా నటించిన శ్రీనిధి శెట్టికి అన్ని భాషల నుంచి అవకాశాలు పెరుగుతున్నాయట. తెలుగు నుంచి కూడా అవకాశాలు వెళుతుండటంతో, తెలుగు భాషను మరింత బాగా నేర్చుకోవడానికి తాను ప్రయత్నిస్తున్నట్టు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది.