రాష్ట్రప‌తితో ఏపీ గ‌వ‌ర్న‌ర్ భేటీ... ముగిసిన బిశ్వ‌భూష‌ణ్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌
Add ap7am to your home Screen

రాష్ట్రప‌తితో ఏపీ గ‌వ‌ర్న‌ర్ భేటీ... ముగిసిన బిశ్వ‌భూష‌ణ్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌

ap governor meets president on monday
  • రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో కోవింద్‌తో భేటీ
  • రాష్ట్రంలోని తాజా ప‌రిస్థితుల వివ‌ర‌ణ‌
  • రేపు విజ‌య‌వాడ‌కు గ‌వ‌ర్న‌ర్ ప‌య‌నం
గ‌త వారం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ సోమ‌వారం రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ భేటీ సందర్భంగా ఏపీలోని తాజా ప‌రిస్థితుల‌ను రాష్ట్రప‌తికి గ‌వ‌ర్న‌ర్ వివ‌రించారు. గ‌త‌వారం ఉన్న‌ట్టుండి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్‌...త‌న ఢిల్లీ టూర్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో కూడా భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. సోమ‌వారం నాటి రాష్ట్రప‌తి భేటీతో గ‌వ‌ర్న‌ర్ ఢిల్లీ టూర్ ముగిసింది. మంగ‌ళ‌వారం గ‌వ‌ర్న‌ర్ తిరిగి విజ‌య‌వాడ బ‌య‌లుదేర‌తారు.
AP Governor
Biswabhusan Harichandan
President Of India
Ram Nath Kovind

More Telugu News