Koteswar Raju: నిర్మాతలను ట్రాప్ చేయడం జీవితకు అలవాటే!: 'గరుడవేగ' నిర్మాత కోటేశ్వర్ రాజు

Koteswar Raju alleged Jeevitha traps Producers
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ సెలబ్రిటీ జీవితా రాజశేఖర్ పై ఇటీవల జోస్టర్ ఫిలిం సర్వీసెస్ సంస్థ తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. రాజశేఖర్ నటించిన గరుడవేగ చిత్ర నిర్మాణం కోసం తమ వద్ద నుంచి తీసుకున్న రూ.26 కోట్లను ఎగవేశారంటూ జోస్టర్ ఫిలిం సర్వీసెస్ సంస్థ డైరెక్టర్, గరుడవేగ నిర్మాత కోటేశ్వర్ రాజు ఆరోపించారు. ఈ ఆరోపణలను జీవిత ఖండించారు. ఈ నేపథ్యంలో, కోటేశ్వర్ రాజు మరోసారి మీడియా ముందుకు వచ్చారు. 

గరుడవేగ సినిమా చిత్రీకరణ సమయంలో జీవిత తన మామయ్య వరదరాజన్ ను తీసుకుని తమ ఇంటికి వచ్చి డబ్బు కోసం కాళ్లు పట్టుకుందని కోటేశ్వర్ రాజు వెల్లడించారు. వాస్తవానికి రాజశేఖర్ కు డబ్బు అవసరం లేదని, జీవితకే డబ్బు అవసరం ఉందని అన్నారు. కుమార్తెలను అడ్డంపెట్టుకుని డబ్బు గుంజే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. నిర్మాతలను ట్రాప్ చేయడం జీవితకు అలవాటేనని, కానీ తాము లండన్ నుంచి వచ్చామని, ఆమె ట్రాప్ లో చిక్కుకోమని స్పష్టం చేశారు. ఆవలిస్తే పేగులు లెక్కపెడతామని కోటేశ్వర్ రాజు హెచ్చరించారు. 

జీవిత తన చిలుక పలుకులను మీడియా ఎదుట కాకుండా, కోర్టులో పలకాలని అన్నారు. జీవిత మోసాల గురించి ఆమె మామయ్య వరదరాజన్ ఎన్నో పర్యాయాలు మా వద్ద చెప్పుకుని బాధపడ్డారని వివరించారు. రాజశేఖర్ కోసం సోదరుడి నుంచి డ్రగ్స్ తెప్పించిందని కోటేశ్వర్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. 'డబ్బులు ఇచ్చిన రోజున మేం దేవుళ్లుగా కనిపించాం, కానీ ఇప్పుడు మాకు రావాల్సిన డబ్బులు అడుగుతుంటే మీకు ఎలా కనిపిస్తున్నాం?' అని ప్రశ్నించారు.
Go Back to Shorts
Koteswar Raju
Jeevitha
Trap
Producers
Tollywood

More Telugu News