స్వ‌రూపానంద స్వామి ఆశీస్సులు తీసుకోవ‌డానికి విశాఖ శార‌దా పీఠానికి రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్వ‌రూపానంద స్వామి ఆశీస్సులు తీసుకోవ‌డానికి విశాఖ శార‌దా పీఠానికి రోజా

roja vistst sharada pitam
  • ప‌లు పుణ్య క్షేత్రాల్లో ప‌ర్య‌టిస్తోన్న రోజా
  • రాజ‌శ్యామల అమ్మ‌వారి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు
  • రోజా వెంట ఆమె కుటుంబ స‌భ్యులు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రిగా బాధ్య‌తలు స్వీక‌రించిన వైసీపీ నాయ‌కురాలు ఆర్కే రోజా ప‌లు పుణ్య క్షేత్రాల్లో ప‌ర్య‌టిస్తూ పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. ఇప్ప‌టికే ప‌లు ఆల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన్న ఆమె.. ఈ రోజు విశాఖ శార‌దా పీఠాన్ని సంద‌ర్శించారు. స్వ‌రూపానంద స్వామి ఆశీస్సుల కోసం ఆమె అక్క‌డ‌కు వెళ్లారు. 

రాజ‌శ్యామల అమ్మ‌వారి ఆల‌యంలో ఆర్కే రోజా ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. రోజా వెంట ఆమె కుటుంబ స‌భ్యులు కూడా ఉన్నారు. పర్యాటక, సంస్కృతి, యువజన సర్వీసుల శాఖల‌ మంత్రిగా ఆర్‌కే రోజాకు ఏపీ కొత్త‌ కేబినెట్ లో చోటు ద‌క్కిన విష‌యం తెలిసిందే.
Roja
YSRCP
Andhra Pradesh

More Telugu News