రక్తదానం చేసిన పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా!
Add ap7am to your home Screen

రక్తదానం చేసిన పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా!

Pawan Kalyan son Akira Nandan donates blood
  • 18 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన అకీరా
  • తొలిసారి రక్తదానం చేసిన పవన్ తనయుడు
  • ఇన్స్టాగ్రామ్ లో ఫొటో షేర్ చేసిన రేణు దేశాయ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ తన జీవితంలో తొలిసారి రక్తదానం చేశాడు. 18 సంవత్సరాల వయసులోకి అడుగుపెట్టిన అకీరా రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తనయుడు రక్తదానం చేసిన ఫొటోను తల్లి రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. 

18 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన అకీరా తొలిసారి రక్తదానం చేశాడని రేణు తెలిపారు. మన రక్తం ఎంతో విలువైనదని... అవసరమైన వారికి రక్తం ఇవ్వాలని కోరారు. 18 ఏళ్లలో అడుగుపెట్టిన వారు రక్తదానం చేయాలని చెప్పారు. మీరు ఇచ్చిన రక్తం మరో వ్యక్తి ప్రాణాన్ని కాపాడుతుందని అన్నారు.
Akira Nandan
Blood donation
Pawan Kalyan

More Telugu News