'అంటే .. సుందరానికీ' అంతకుమించి అన్నట్టుగా ఉంటుంది: నాని
- వినోదప్రధానంగా సాగే 'అంటే .. సుందరానికీ'
- నాని సరసన నాయికగా నజ్రియా
- దర్శకుడిగా వివేక్ ఆత్రేయ
- జూన్ 10వ తేదీన సినిమా విడుదల
ఈ వేదికపై నాని మాట్లాడుతూ .. "అంటే .. సుందరానికీ' సినిమా నాకు చాలా చాలా స్పెషల్ సినిమా. ఎందుకు అనేది .. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా .. అప్పుడు చెబుతాను. ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా మేమంతా కలిసి ఈ సినిమాకి పనిచేశాము. ఈ సినిమాను వివేక్ తప్ప ఇంకా ఎవరూ తీయలేరు. ఈ కథను ఆయన చెప్పినట్టుగా ఎవరూ చెప్పలేరు.
నా సినిమా అనే కాదు ఇకపై వివేక్ ఏ సినిమా తీసినా ఫస్టు డేనే మార్నింగ్ షో చూస్తాను. నజ్రియాతో తెలుగు సినిమా చేయించాలని ఇంతకుముందు చాలామంది ప్రయత్నించారుగానీ కుదరలేదు. ఈ సినిమా చేయడానికి ఆమె అంగీకరించడం విశేషం. టీజర్ కి రెండు రెట్లు ట్రైలర్ ఉంటుంది .. దానికి పది రెట్లు సినిమా ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.