Pawan Kalyan: చంద్ర‌బాబుకి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, దేవినేని ఉమ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

pawa wishes chandrababu
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 73వ పడిలో అడుగుపెట్టారు. ఆయ‌న‌ పుట్టినరోజు సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా స్పందిస్తూ... 'మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడి గారికి హృద‌యపూర్వ‌క జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. శ్రీ చంద్ర‌బాబు గారికి భ‌గ‌వంతుడు ఆశీస్సులు అందించి, సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాల‌ని ఆకాంక్షిస్తున్నాను' అని ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. 

'పట్టిసీమతో గోదావరి తల్లిని కృష్ణమ్మ చెంతకు చేయిపట్టి నడిపించిన అపర భగీరథుడు, దేశంలోనే మొదటి నదుల అనుసంధాన కర్త చంద్ర‌బాబు నాయుడి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు' అని టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వరరావు పేర్కొన్నారు.  

గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి చంద్ర‌బాబు శ్రీ‌కారం చుట్టార‌ని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా, గొల్లపూడి వన్ సెంటర్ లో ఘనంగా చంద్ర‌బాబు నాయుడి పుట్టినరోజు వేడుకలు నిర్వ‌హించామ‌ని దేవినేని ఉమ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు. 

Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Chandrababu

More Telugu News