కశ్మీర్లో షూటింగుకి విజయ్ దేవరకొండ - సమంత రెడీ!

Samantha In Shiva NIrvana Movie
  • శివ నిర్వాణ నుంచి మరో లవ్ స్టోరీ 
  •  ఈ నెల 21వ తేదీన పూజా కార్యక్రమాలు
  • 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • కశ్మీర్ లో ఫస్టు  షెడ్యూల్  
విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. 'లైగర్' సినిమా కారణంగా ఆలస్యమవుతూ వచ్చిన ఈ సినిమా, ఇక ఇప్పుడు పట్టాలెక్కుతోంది. ఈ సినిమాలో కథానాయికగా సమంతను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆమెనే ఖరారు చేశారనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది.

ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టుగా చెబుతున్నారు. ఆ రోజు ఉదయాన్నే పూజా కార్యక్రమాలు మొదలవుతాయని అంటున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగును స్టార్ట్ చేయనున్నారు. ఫస్టు షెడ్యూల్ ను కశ్మీర్ లో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. నాయక, నాయికల మధ్య అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. 

ప్రేమకథల స్పెషలిస్టుగా శివ నిర్వాణకి మంచి పేరుంది. ఈ సినిమా కూడా ప్రేమకథా నేపథ్యంలోనే కొనసాగుతుందట. సోల్జర్ గా విజయ్ దేవరకొండ కనిపించనున్న ఈ సినిమాలో సమంత పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు.  'మజిలీ' తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత  చేస్తున్న సినిమా కావడంతో, అందరిలో ఆసక్తి నెలకొంది.
Go Back to Shorts
Samantha
Vijay Devbarakonda
Shiva Nirvana Movie

More Telugu News