Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంబులెన్స్ ను చూసి కాన్వాయ్ ఆపించిన సీఎం జగన్

CM Jagan stops his convoy after seen ambulance
  • ఒంటిమిట్ట విచ్చేసిన సీఎం జగన్
  • కడప ఎయిర్ పోర్టు రోడ్డు మార్గంలో పయనం
  • వైఎస్సార్ సర్కిల్ వద్ద అంబులెన్స్ ను చూసిన సీఎం 
  • అధికారులను అప్రమత్తం చేసిన వైనం
ఏపీ సీఎం జగన్ ఇవాళ ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ క్రమంలో, కడప విమానాశ్రయం నుంచి ఒంటిమిట్టకు రోడ్డుమార్గంలో బయల్దేరారు. అయితే సీఎం కాన్వాయ్ వైఎస్సార్ సర్కిల్ వద్దకు రాగానే, అటుగా 108 అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ ను చూసిన వెంటనే సీఎం జగన్ అధికారులను అప్రమత్తం చేశారు. అంబులెన్స్ కు వెంటనే దారివ్వాలని స్పష్టం చేశారు. దాంతో అధికారులు వెంటనే స్పందించి కాన్వాయ్ ని నిలిపివేయడంతో, అంబులెన్స్ ముందుకెళ్లింది. అనంతరం సీఎం జగన్ కాన్వాయ్ ఒంటిమిట్టకు పయనమైంది.
CM Jagan
Convoy
Ambulance
Kadapa
Vontimitta

More Telugu News